1. *హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ కి అందిన ఫిర్యాదు మేరకు*

  2.  *జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు గారి సూచనల మేరకు*
  3.  
  4.  *ఈరోజు అనగా 02-09-2025 తేదీనాడు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో రామేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమిని కొందరు ఆక్రమించి దేవాలయానికి ఆర్థిక వనరులు లేకుండా చేయడం జరిగింది. గుడి పూజారి భాస్కర్ అయ్యగారు ఇచ్చిన ఫిర్యాదుతో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ స్టేట్ ప్రెసిడెంట్ కాకర్ల సరస్వతి గారి ఆధ్వర్యంలో పలుకూరు గ్రామానికి వెళ్లి ఆక్రమించిన వారితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించడం జరిగింది. గుడి పూజారి గారు ఈవో గారు హెచ్ఆర్ ఏజే కి ధన్యవాదాలు తెలియజేశారు.*
  5.            *ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి గారు, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాంజనేయులు గారు, అనంతపూర్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ నాయుడు గారు, శ్రీకాంత్ గారు, రవికుమార్ గారు పాల్గొనడం జరిగింది.*