హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్✊✊
31/7/25 అనంతపురం జిల్లా పుట్లూరు మండలం పుట్లూరు గ్రామంలో కస్తూరిబా బాలికల పాఠశాలను సందర్శించి, 9, 10 తరగతి విద్యార్థినులకు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి గారు మానవహక్కుల సంఘం అంటే మాకెంతో గౌరవమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి మాట్లాడుతూ తల్లి దండ్రి లేని విద్యార్థినిలు ఉంటే మాకు చెప్పండి మా ఆర్గనైజింగ్ ద్వారా వారికి చదువుకు సంబంధించిన ఏ విధమైన సహాయం చేస్తామని, ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు చాలా అలర్ట్ గా ఉండాలని, ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లాంటి యాప్స్ లో తెలియని వారితో పరిచయాలు పెంచుకోవద్దని, భవిష్యత్తులో మీరు మంచి గమ్యం చేరాలంటే మీ చదువే మీకు మార్గం చూపిస్తుందని తెలియజేయడం జరిగింది. కురుపాటి కర్ణ కుమార్, గుత్తా భాస్కర్ నాయుడు, శంషాద్ పాల్గొనడం జరిగింది.