హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్( HRAJ) జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు గారి సూచనల మేరకు HRAJ కుటుంబ సభ్యులు ఈరోజు 06-11-2025 న తాడిపత్రి ASP రోహిత్ కుమార్ చౌదరి గారిని ఒక సమస్య నిమిత్తం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ASP గారు సమస్యను పూర్తిగా విని దానికి సంబంధించిన విషయాలను తెలుసుకొని కచ్చితంగా బాధితురాలకు సత్వర న్యాయం చేస్తానని మన హ్యూమన్ రైట్స్ వారికి తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చినా డైరెక్టుగా నా దగ్గరికే వచ్చి మీరు ఫిర్యాదు చేయవచ్చు అని భరోసా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మన హ్యూమన్ రైట్స్ వారు ASP గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

 ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి, కరుణ కుమార్, గుత్తా భాస్కర్ నాయుడు, నాగబాబు, శ్రీనివాసులు, శ్రీకాంత్, రవికుమార్, మహబూబ్ బాషా, రామ తులసి, పద్మజ, శంషాద్ పాల్గొనడం జరిగింది.