హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో నక్షత్ర ఫంక్షన్ హాల్ లో నూతన కార్యవర్గ సమావేశం 15/9/25 సోమవారం జరిగింది
హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు గారు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డివి శివకుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి గారు నక్షత్ర మినీ ఫంక్షన్ హాల్ నందు హెచ్ఆర్ఏజే టీమ్ మెంబర్స్ కు ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నందం నరసింహారావు గారు సంస్థ విధివిధానాల గురించి, సొసైటీలో జరుగుతున్న అనేక రకాలైన సమస్యల గురించి, వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు అని తెలియజేశారు. సమస్య ఏదైనా పరిష్కరించే హక్కు మనకుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డివి శివకుమార్ గారు మాట్లాడుతూ మానవ హక్కుల సంఘం ఎప్పుడు పుట్టింది ఎలా దినదినాభివృద్ధి చెందింది అని వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి గారు మాట్లాడుతూ మహిళలకు ఏ కష్టం వచ్చినా న్యాయం వారి వైపు ఉంటే ఎంత దూరమైనా మేము మా సంస్థ ముందుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో స్టేట్ లీగల్ అడ్వైజర్ ధారా శేఖర్ గారు, స్టేట్ కన్వీనర్ గుత్తా భాస్కర్ నాయుడు గారు, స్టేట్ ఉమెన్ ఫోర్ట్ వైస్ ప్రెసిడెంట్ రాధిక కిరణ్ గారు, అనంతపూర్ ఉమెన్ ఫోర్ట్ ప్రెసిడెంట్ చంద్రకళ రాయల్ గారు, కడప డిస్టిక్ ప్రెసిడెంట్ సుకృత్ గారు రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన హెచ్ఆర్ఏజే టీం సభ్యులు పాల్గొనడం జరిగింది.