హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ✊✊
9/8/2025
రాఖీ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మకుమారి పద్మ అక్కయ్య గారు మన హెచ్ఆర్ఏజే సంస్థ చేస్తున్నటువంటి సోషల్ సర్వీసెస్ ,, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా గొప్పగా ఉన్నాయని తెలియ చేశారు.అలాగే శాంతి సందేశం ఇచ్చి సమస్యల మీద పోరాడుతున్న టీమ్ మెంబర్స్ కి మానసిక ప్రశాంతత చాలా అవసరమని, ప్రతి మనిషి తన కోసం కొంచెం సమయం కేటాయించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ ఏ జె ఆంధ్ర ప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి మాట్లాడుతూ మా సంస్థ ఎటువంటి రాజకీయ పార్టీలకు, కులానికి, మతానికి సంబంధం లేకుండా మీ సమస్య మా పరిష్కారం అనే నినాదంతో ముందుకెళ్తుందని, టీం ని మరింత బలోపేతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగ రంగయ్య, కరుణాకర్, భాస్కర్, వివేక్, కేశవరావు, రవి, విజయ్, శ్రీకాంత్, భాష, శ్రీనివాసులు, హనీఫ్, మనోజ్, సాయి, శంషాద్, మొబీనా, పద్మజ, మొదలగు టీమ్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది.