మీ సమస్య మా పరిష్కారం అనే నినాదంతో దూసుకెళ్తున్న హెచ్ఆర్ఏజే 🙏🙏🙏
హెచ్ఆర్ఏజె టీం సభ్యురాలు అయినటువంటి ఆండ్ర అనురాధ గారికి వాళ్ల నాన్నగారి భూమి ని తన అన్న కృష్ణమూర్తి గత కొన్ని సంవత్సరములుగా బాగ పరిష్కరణ చేయకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లో లోపం ఉందని అది క్లియర్ అయిన తర్వాత చేస్తానని చెబుతూ వచ్చారు. అనురాధ గారు ఎన్నిసార్లు ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా లేనిపోని కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు.✊✊
జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు గారి సూచనతో ఆంధ్ర ప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కన్వీనర్ గుత్త భాస్కర్ నాయుడు గారు, డిస్టిక్ జనరల్ సెక్రెటరీ కేశవరావు కొత్త కొండాపురం కి వెళ్లి ఎమ్మార్వో గారితో సమస్య గురించి తెలుసుకున్నారు. అనురాధ గారికి రావలసిన 4:30 ఎకరాలో ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా రిజిస్టర్ కు రెడీగా రెండున్నర ఎకరా ఉందని దాన్ని వెంటనే వారి పేరుతో రిజిస్టర్ చేయాలని అనురాధ గారి అన్న కృష్ణమూర్తి కి హ్యూమన్ రైట్స్ సభ్యులు తెలియజేశారు. ఆన్లైన్లో లేని మిగతా భూమి ని కూడా తక్షణమే జె సి ఆఫీస్ కి కంప్లైంట్ చేయాలని MRO గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ భూమి విషయంలో మాజీ సర్పంచ్ సుధాకర్ నాయుడు గారు మన హ్యూమన్ రైట్స్ సభ్యులకు తన సహకారాన్ని అందించడం జరిగింది.
అనురాధ గారు రక్త సంబంధీకులు ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదని,, మన హ్యూమన్ రైట్స్ కుటుంబ సభ్యులే నాకు భగవంతుడు ఇచ్చిన బంధువులని భావోద్వేగంతో తెలియజేశారు. కోడూరు కొత్తపల్లి మాజీ సర్పంచ్ సుధాకర్ నాయుడు గారు మన హ్యూమన్ రైట్స్ సభ్యులకు ఈ సమస్యలో తన సహకారాన్ని అందించడం జరిగింది.ఇందులో ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి, స్టేట్ కన్వీనర్ గుత్తా భాస్కర్ నాయుడు, డిస్టిక్ జనరల్ సెక్రెటరీ కేశవ గారు, కోడూరు కొత్తపల్లి మాజీ సర్పంచ్ సుధాకర్ నాయుడు గారు, శేఖర్ నాయుడు గారు ఉన్నారు