*హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో విజయవాడ లో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతిని పురస్కరించుకొని వారికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది, ప్రపంచ మేధావి, రాజ్యాంగ సృష్టికర్త, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ని నిర్వహించడం గర్వంగా ఉందని అలాగే సమాజంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రాసి ఓటు హక్కు ద్వారా ప్రజలు స్వతంత్రంగా బతికే విధంగా రాజ్యాంగాన్ని రాశారని మరియు చదువులో కూడా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసి గొప్ప వారుగా పేరు ప్రఖ్యాతలు పొందారని యువత, యువకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని గుర్తుంచుకొని చదువు పట్ల శ్రద్ధ చూపించి ఉన్నత స్థాయికి దేశానికి అభివృద్ధి పథంగా ముందుకు పోవాలని అలాగే మీకోసం కష్టపడుతున్న తల్లిదండ్రులకు గౌరవ మర్యాదలు ఇవ్వాలని అంబేద్కర్ గారు భారత దేశ ప్రజల కోసం ఒక ఆయుధం లాంటి రాజ్యాంగాన్ని రాశారని ఆ రాజ్యాంగంలోని కొన్ని అంశాల వల్ల పథకాల వల్ల సామాన్య ప్రజలు మూడు పూటలా జీవనం సాగిస్తున్నారని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిర్మాతనీ గుర్తించుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాము*
*ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జింకా దివ్య నారాయణ గారు పాల్గొన్నారు*