అనంతరం జిల్లా,గుంతకల్లు పట్టణం లో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జిగింది 

 

ప్రజల హక్కుల పరిరక్షణకు సేవా సంస్థలు ముందుకు రావాలి – మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి

 

బాధితులకు అండగా నిలవడమే మా లక్ష్యం – బేపర్ గౌసియా

 

“మీ సమస్య… మా పరిష్కారం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్

 

  1. జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు ఆదేశాల మేరకు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నూతన కార్యాలయాన్ని గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ…. సమాజంలో బలహీన వర్గాలు, మహిళలు, బాధితులకు అండగా నిలిచే సంస్థలు ఎంతో అవసరమని అన్నారు. ప్రజలకు వారి హక్కులపై అవగాహన కల్పించడం, బాధితులకు న్యాయం జరిగేలా సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ వంటి సంస్థలు ప్రజలకు ధైర్యం ఇవ్వడంతో పాటు సామాజిక న్యాయం సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొనేలా కృషి చేయాలని ఆమె సూచించారు. సేవా భావంతో పనిచేసే సంస్థలకు మున్సిపాలిటీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉమెన్ పోర్ట్ జాయింట్ సెక్రటరీ బేపర్ గౌసియా మాట్లాడుతూ…. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అనేది సమాజంలోని బలహీన వర్గాలు, బాధితులు, అణగారిన ప్రజలకు అండగా నిలిచే సేవా సంస్థ అని పేర్కొన్నారు. జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు నాయకత్వంలో సంస్థ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు.మహిళల భద్రత, సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ కోసం సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ప్రతి బాధితుడికి న్యాయం జరిగే వరకు సంస్థ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.“మీ సమస్య… మా పరిష్కారం” అనే నినాదంతో ప్రజలకు అండగా నిలుస్తూ, న్యాయం కోసం నిరంతరం సేవలు అందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా మీడియా సెక్రటరీ డి. ఖాజావలి, టౌన్ ప్రెసిడెంట్ దావూద్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ సమీర్, గుంతకల్లు టౌన్ మీడియా సెక్రటరీ రాజేష్, చిప్పగిరి సత్తార్ హాది, బంబం సాహెబ్ పీఠాధిపతులు సయ్యద్ రియాజ్ భాషా ఖాద్రీ, పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి ఆటో ఖాజా, రఫిక్, ఎస్. ఇబ్రహీం భాషా మునిసిపల్ ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు.