*కోనసీమ జిల్లా నూతన కార్యవర్గం సమావేశం నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నేషనల్ చైర్మన్ మరియు పౌండర్ నందం నరసింహారావు*

*డాక్టర్ బి అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నియెాజకవర్గ కేంద్రమైన రామచంద్రాపురం నందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రక్కన హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ కోనసీమ జిల్లా నూతన కార్యలయం ను నేషనల్ అసోసియేషన్ చైర్మన్ మరియు పౌండర్ నందం నరసింహారావు ప్రారంభోత్సవం చేసారు అనంతరం నూతన కార్యవర్గ సమావేశం ను కోనసీమ జిల్లా అధ్యక్షులు కట్టా సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పౌండర్ నరసింహారావు మాట్లాడుతూ భారత రాజ్యంగం అమలు చేస్తున్న మానవహక్కుల పై ప్రజలకు అవగాహన కల్పించి అందరికి న్యాయము చేసేందుకు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అండగా ఉండి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తుందని తెలియజేసారు.మహిళల భద్రత, సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ కోసం సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ప్రతి బాధితుడికి న్యాయం జరిగే వరకు అసోసియేషన్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.“మీ సమస్య… మా పరిష్కారం” అనే నినాదంతో ప్రజలకు అండగా నిలుస్తూ, న్యాయం కోసం నిరంతరం సేవలు అందిస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా సెక్రటరీ ఎం. వెంకటేశ్వర్లు,కోనసీమ జిల్లా కో ఆర్డినేటర్ కోయ్య సతీష, లీగల్ అడ్వ్యజర్లు నిమ్మగడ్డ విజయ్,రవ్వ చంద్రశేఖర్ రవి కిరణ్,ఆర్గనైజేషన్ సెక్రటరీలు కట్టా ఆనంద్,ఎల్.రాఘవేంద్ర,జిల్లా మీడియా సెక్రటరీలు జి. వి. రాజు,సాయి, కాకినాడ జిల్లా అధ్యక్షులు వి. తాతాజీ, వెల్పెర్ సెక్రటరీ కె. నాగరాజు,ఆర్గనైజింగ్ సెక్రటరీ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు*