అనంతపూర్ డిస్టిక్ తాడిపత్రికి వచ్చినటువంటి సంస్థ చైర్మన్ నందం నరసింహారావు గారిని ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి స్టేట్ కన్వీనర్ గుత్తా భాస్కర్ నాయుడు గారు అడ్వకేట్ ఫరీదా గారు మంగపట్నం శ్రీనివాసులు గారు, కదిరి శ్రీకాంత్ రెడ్డి, మహీధర్ రెడ్డి జయ ప్రకాష్, కుళ్లాయప్ప,రామ తులసి విజయలక్ష్మి పద్మజ జయశ్రీ మొదలకు వారు చైర్మన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో ఘనంగా సత్కరించారు.
నందం నరసింహారావు గారు సంస్థ విధివిధానాల గురించి, సంస్థ భవిష్యత్తు కార్యాచరణ గురించి టీం సభ్యులకు వివరించారు. ప్రజలకు దగ్గరగా వారి హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరికి సంస్థ ఎప్పటికీ తోడుగా ఉంటుందని తెలియజేశారు. కొత్తగా జాయిన్ అయిన వారికి అలాట్మెంట్ లెటర్స్ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగినది.తదుపరి ఆంధ్ర ప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి గారిని అడ్వకేట్ ఫరీదా గారిని స్టేట్ కన్వీనర్ గుత్తా భాస్కర్ నాయుడు గారిని శాలువా తో సన్మానించారు, అనంతపురం జిల్లా అధ్యక్షులు మిద్దె నరసింహులు గారు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ మిద్దె నరసింహులు గారు, హెచ్‌ఆర్‌ఏజే ఉమెన్ ఫోర్స్ అనంతపురం అధ్యక్షురాలు జి.ఎస్. రేష్మ గారు, అనంతపురం జిల్లా ఉమెన్ ఫోర్స్ ప్రతినిధి షాహినా గారు, తాడిపత్రి పట్టణ ఉమెన్ ఫోర్స్ అధ్యక్షురాలు శంషాద్ గారు, పాల్గొని శ్రీ నందం నరసింహారావు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
“మానవ హక్కుల పరిరక్షణే మా లక్ష్యం”







