హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (HRAJ) చైర్మన్ & ఫౌండర్ శ్రీ నందం నరసింహారావు గారి ఆదేశాల మేరకు, అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ మిద్దె నరసింహులు గారి ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అలాగే పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో పలుచోట్లా నందలపాడు సచివాలయం, రైల్వేస్టేషన్, బస్టాండ్ పాల్గొనడం జరిగింది 

ఈ సందర్భంగా ప్రజలకు 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని అవగాహన కల్పించాము. రాష్ట్రవ్యాప్తంగా 29,873 పోలియో కేంద్రాలు, 1,144 ప్రత్యేక కేంద్రాలు, 1,757 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, 68.67 లక్షల వ్యాక్సిన్ మోతాదులు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమం ద్వారా 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం చిన్నారులను పోలియో కేంద్రాలకు తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ జి.ఎస్. రేష్మా, అనంతపురం ఉమెన్ స్పోక్ పర్సన్ ఎస్. షాహినా, తాడిపత్రి టౌన్ ప్రెసిడెంట్ ఎస్. శంషాద్ , ఎల్లనూరు మండల ప్రెసిడెంట్ జి. ప్రసాద్, అలాగే HRAJ కుటుంబ సభ్యులు ఎస్.బి. షబానా, ఎస్. మహబూబ్ బాషా, మిద్దె పవన్ కుమార్, ఆనంద్ బాబు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

“ప్రతి చిన్నారికి రెండు చుక్కలు… పోలియో రహిత భారతదేశం మనందరి లక్ష్యం.”