జాతీయ అధ్యక్షులు నందం నరసింహరావు గారి సూచనలతో హెచ్ఆర్ఏజే సేవా కార్యక్రమం
సమాజ సేవలో మరో ముందడుగు.. పేద విద్యార్థులకు అండగా హెచ్ఆర్ఏజే,
పేద విద్యార్థుల విద్యకు అండగా ఎమ్మెల్యే జయరాం.. ఒక్క ఫోన్‌కే రూ.25 వేల సహాయం
హెచ్ఆర్ఏజే ఆధ్వర్యంలో 65 మంది చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ








పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (హెచ్ఆర్ఏజే) ఆధ్వర్యంలో గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్ చత్రపతి శివాజీ పురపాలక ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులకు స్లేట్లు, నోట్‌బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, షార్ప్నర్లు పంపిణీ చేశారు.హెచ్ఆర్ఏజే జాతీయ అధ్యక్షులు నందం నరసింహరావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఉమెన్ విభాగం జాయింట్ సెక్రటరీ బేపర్ గౌసియా, అనంతపురం జిల్లా మీడియా సెక్రటరీ ఖాజావలి, గుంతకల్లు నియోజకవర్గ మీడియా సెక్రటరీ రాజేష్, టౌన్ అధ్యక్షుడు దావూద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బేపర్ గౌసియా మాట్లాడుతూ….పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించేందుకు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు ఫోన్ చేసి విషయం చెప్పగానే, ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారని తెలిపారు. “ముందుగా పిల్లలకు కావాల్సిన అన్ని వస్తువులు తీసుకోండి. మొత్తం ఎంత ఖర్చవుతుందో చెప్పండి, వెంటనే డబ్బులు చెల్లిస్తాం” అని ఎమ్మెల్యే చెప్పారని వెల్లడించారు.బుక్ స్టాల్లో రూ.25 వేల అంచనా రావడంతో కేవలం పది నిమిషాల్లోనే మొత్తం నగదును అందించి విద్యార్థులకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారని గౌసియా తెలిపారు. “ప్రజా ప్రతినిధి అంటే ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలబడాలి. గుమ్మనూరు జయరాం అదే నిరూపించారు. ఒక్క ఫోన్‌కే స్పందించి రూ.25 వేల సహాయం అందించడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. పేద విద్యార్థుల చదువుపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అభినందనీయం. ఇలాంటి ప్రజాహిత నాయకులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. మా సంస్థ తరఫున ఎమ్మెల్యే జయరాం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని అన్నారు.అనంతపురం జిల్లా మీడియా సెక్రటరీ ఖాజావలి మాట్లాడుతూ…. “విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే ప్రతి సేవ సమాజ నిర్మాణానికి బలమైన పునాది. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు నందం నరసింహరావు ఆదేశాలతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. పేద పిల్లలకు అవసరమైన ప్రతి సహాయ కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో మరింత విస్తృతంగా నిర్వహిస్తాం. సమాజంలో ఎవరూ చదువుకు దూరం కాకూడదనేదే మా సంస్థ లక్ష్యం” అని తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్వేత, ఉపాధ్యాయులు మానస, మధుసూదన్ నాయుడు, కస్తూరి, శిరీష, టీడీపీ 14వ వార్డు ఇన్చార్జి అశోక్, ఎస్సీ సెల్ సెక్రటరీ జయచంద్ర, చత్రపతి స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ వినోద్, ఎన్టీఆర్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ బాబు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు హెచ్ఆర్ఏజే ప్రతినిధులకు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు కృతజ్ఞతలు తెలిపారు.