హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.

 

 ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, హెచ్ఆర్ఏజే (Human Rights Association for Justice) సంస్థ ఆధ్వర్యంలో తాడిపత్రి ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలో జండా వందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరియు శ్రీ రమణ మహర్షి ఆశ్రమం పాఠశాలలో నివసిస్తున్న అనాధ పిల్లలకు, మరియు తాడిపత్రి పట్టణంలో 100 పడకల హాస్పటల్ నందు మరియు మానసిక వికలాంగులు, దివ్యాంగులు కంటిచూపు లేని వారు ఉండే జీవనాలయం లో పండ్లు, బ్రెడ్‌లు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.

 

స్వాతంత్ర్యం అంటే కేవలం జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, సమాజంలోని నిరుపేదలు, అనాధలు, అశరణుల ముఖాల్లో ఆనందాన్ని నింపడం కూడా నిజమైన స్వాతంత్ర్య స్ఫూర్తికి నిదర్శనం. ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి ఈ పండుగను జరుపుకోవడం ప్రతి ఒక్కరికీ హృదయాన్ని తాకే అనుభూతిని కలిగించింది.

 

ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఏజే ఏపీ స్టేట్ కన్వీనర్ శ్రీ గుప్తా భాస్కర్ నాయుడు గారు, అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ మిద్దె నరసింహులు గారు, ఉమెన్ ఫోర్స్ అధ్యక్షురాలు శ్రీమతి జి.ఎస్. రేష్మ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ రవి కుమార్ గారు, స్పోక్ పర్సన్ శ్రీమతి ఎస్. షాహీన్ గారు, తాడిపత్రి వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్. మహబూబ్ బాషా గారు, ఉమెన్ ఫోర్స్ అధ్యక్షురాలు శ్రీమతి శంషాద్ గారు, అలాగే హెచ్ఆర్ఏజే కుటుంబ సభ్యులు శ్రీమతి లక్ష్మీదేవి గారు, శ్రీమతి షబానా గారు, శ్రీ నౌషాద్ బాషా గారు మరియు ఇతర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

అనాధ పిల్లల చిరునవ్వులే దేశానికి నిజమైన సంపద. వారి ఆనందంలో భాగస్వాములవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని హెచ్ఆర్ఏజే సంస్థ సంకల్పిస్తోంది.

 

“మన చేతి సహాయం ఒక చిన్నారి ముఖంలో చిరునవ్వును తీసుకురాగలిగితే, అదే నిజమైన దేశభక్తి – అదే స్వాతంత్ర్య దినోత్సవానికి అసలైన అర్థం.”