హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో విజయవాడ భాష్యం స్కూల్ లో
ఈ రోజు అనగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు గారిని హెచ్ఆర్ఏజే సభ్యులు ఘనంగా సత్కరించుకోవడం జరిగినది
గురువు అనేవారు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు. మన జీవితానికి సరైన దారి చూపే మార్గదర్శి. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహనీయులు మన గురువులు,
మన విజయాల వెనుక తల్లిదండ్రుల తర్వాత అత్యంత ముఖ్యమైన పాత్ర గురువులదే. వారు మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, విలువలు మరియు బాధ్యతను పెంపొందిస్తారు. వారి శ్రమకు ప్రతిఫలం మన మంచి ప్రవర్తన మరియు విజయం.
ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి ఆశీస్సులతో మంచి పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
*గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు నందo నరసింహారావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జింక దివ్యనారాయణ గారు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వేమేశ్వరి గారు, ఎన్టీఆర్ జిల్లా ప్రోగ్రామ్ సెక్రటరీ మంగం నవీన్ గారు పాల్గొన్నారు.




