




HRAJ – Human Rights Association for Justice
మానవ హక్కుల పరిరక్షణతో పాటు ప్రతిభను ప్రోత్సహించడం కూడా తమ బాధ్యతగా భావిస్తున్న హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (HRAJ) ఆధ్వర్యంలో, సంస్థ చైర్మన్ & ఫౌండర్ శ్రీ నందం నరసింహారావు గారి మార్గదర్శకత్వంలో, అనంత అమరావతి ఛాంపియన్షిప్ విజేతలు గౌతమి, సూహానా మరియు వారి జట్టు సభ్యులకు ఘనంగా అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేక షీల్డ్‌ను అందజేసి సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో HRAJ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ మిద్దెన నరసింహులు గారు, అనంతపురం జిల్లా ఉమెన్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ శ్రీమతి జి.ఎస్. రేష్మా గారు, తాడిపత్రి టౌన్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్. మహబూబ్ బాషా గారు, శ్రీ సాయి చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ & కరస్పాండెంట్ శ్రీ నరసింహులు గారు పాల్గొని విజేతలను అభినందించారు.
అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా యువత మరిన్ని విజయాలు సాధించాలని HRAJ ఆకాంక్షిస్తోంది.
#HRAJ #HumanRightsAssociationForJustice
#Gautami #Suhana #Sports Excellence
#APStateConvener 🙏🙏🙏