భార్య భర్తల మధ్య సమస్య పరిష్కారం చేసిన హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ కర్నూలు జిల్లా టీం 

కర్నూల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరములుగా నివాసం ఉంటున్నటువంటి వి నరేంద్ర మరియు వి లావణ్య భార్యాభర్తలు కొద్దిరోజులు నుండి గొడవపడుతూ ఉండటం జరిగింది ఈ గొడవ గురించి నరేంద్ర భార్య v లావణ్య గారు మహిళా పోలీస్ స్టేషన్ లో తన భర్త వి నరేంద్ర మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ గురించి v నరేంద్ర గారు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కర్నూలు టీం వారికి తెలియజేయగా Hraj కర్నూలు టీం వారు మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లి SI గారి ఆధ్వర్యములో వారి గురించి మాట్లాడగా SI గారు వారి ఇద్దరిని పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ కౌన్సిలింగ్ ద్వారా వారు ఇద్దరు రాజి అవ్వడం జరిగింది. SI గారి యొక్క మంచి మాటలకు వారు విధేయత చూపించి ఒకరినొకరు గొడవపడకుండా ఉంటాము అని సమ్మతి తెలుపుచు రాజి కుదుర్చుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన HRAJ కర్నూలు టీం వారికి భార్య భర్తలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది

 

 ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ హనుమన్న గారు, జిల్లా జనరల్ సెక్రెటరీ సుధాకర్ గారు, అడిషనల్ జనరల్ సెక్రటరీ రఫీ గారు,మహిళా అధ్యక్షురాలు భాగ్యమ్మ గారు పాల్గొనడం జరిగినది.