1. *ఈరోజు అనగా29-09-2026 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ లోకాయుక్త జడ్జి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు విజయవాడ విచ్చేసిన సందర్భంగా వారిని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్* *కుటుంబ సభ్యులు గౌరవ లోకాయుక్త జడ్జి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో వారిని సత్కరించి మన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మానవ హక్కుల పరిరక్షణ కార్యక్రమాల వివరాలు వినతిపత్రం ఇవ్వటంజరిగినది.*
  2.  *తదుపరి వారు మన విధి విధానాల గురించి వారు అడుగగా*
  3.  *మానవ హక్కుల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము*
  4.  *మహిళలు మరియు బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తాము*
  5.  *సామాజిక న్యాయం మరియు ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తాము*
  6.  *విద్యార్థులు మరియు యువతలో చట్టాలపై అవగాహన కల్పిస్తాము*
  7.  *సమాజంలో న్యాయం సమానత్వం మానవ గౌరవం మరియు చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణకు మా వంతు కృషి చేస్తున్నాము అని వారికి వివరించటం జరిగినది.*
  8. *ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు గారు, జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి నందం నాగ సుజాత గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. దివ్యనారాయణ గారు, ఎన్టీఆర్ జిల్లా ప్రోగ్రాం సెక్రటరీ మంగం నవీన్ గారు పాల్గొన్నారు.*💐