హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో భార్యాభర్తల ఇద్దరు ఏడు సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి భార్యాభర్తలిద్దరినీ కలిపిన హెచ్ఆర్ఏజే టీం

 సిపిఐ కాలనీకి చెందినటువంటి బెస్త సూరి తన తల్లి, తమ్ముడి తో సహా మన సంస్థ (HRAJ) లో మనం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ చూసి మన అడ్రస్ తెలుసుకొని, వాళ్ళు సమస్య నిమిత్తం మమ్మల్ని (HRAJ) 2 నెలల క్రితం కలవడం జరిగింది. ఈ సమస్య పై పులివెందులలో ఉన్నటువంటి శిరీష ను సంస్థకు పిలిపించాము. అమ్మాయికి భర్త నుంచి దూరముగా ఉంటే వచ్చే ప్రాబ్లంస్ భర్త తో ఉంటే వచ్చే బెనిఫిట్స్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది,చాలాసేపు ఆలోచించి మనం చెప్పినటువంటి మాటలకు అంగీకరించి, ఇఫ్పుటి వరకు ఇలాంటి సలహాలు ఎవరు ఇవ్వలేదని, మన సంస్థ వారు నాపట్ల నా పిల్లలపట్ల భవిష్యత్తు ను దృష్టి లో ఉంచుకొని 7 సమస్సరాల తర్వాత తనను, తన భర్తను కలిపినందుకు ఎంతో సంతోషన్ని వ్యక్తపరిచింది,, తన కాపురాన్ని, నిలబెట్టినందుకు మన సంస్థ కు ధన్యవాదాలు తెలిపింది,,, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ సంస్థకు నేను ఎంతో రుణపడి ఉంటాను అని ధన్యవాదములు తెలిపింది.