హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ✊✊

 అనంతపురం జిల్లా తాడిపత్రి పాతకోటకు చెందినటువంటి నారాయణమ్మ కు ఇద్దరు కుమార్తెలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి నారాయణమ్మను కూతుర్లు ఒక నెల ఒకరి దగ్గర ఇంకొక నెల మరొకరి దగ్గర ఉంచుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాగే జరుగుతూ ఉంది. అనారోగ్య రీత్యా నారాయణమ్మ బస్సు ప్రయాణం చేయలేకపోతుంది. నన్ను ఏదో ఒక కూతురు నా మరణం వరకు చూసుకోవలసినదిగా మనల్ని మన సంస్థని ఆశ్రయించింది. మన హెచ్ఆర్ఏజే ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి ఇరువురి కూతుర్లను మరియు అల్లులను పిలిపించి నారాయణమ్మను ఎవరో ఒకరు చూసుకునే విధంగా వారికి తెలియజేయడం జరిగింది. నారాయణమ్మ ఇష్ట ప్రకారం పెద్ద కూతురు పుల్లమ్మ దగ్గర ఉంటానని తెలియజేశారు. నారాయణమ్మకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా కూడా పుల్లమ్మని చూసుకునే విధంగా మన సంస్థ నుంచి మనము పెద్ద కూతురు పుల్లమ్మకు తెలియజేశాము. పుల్లమ్మ కూడా మన మాటను ఒప్పుకొని తల్లిని తీసుకెళ్లారు.

 నారాయణమ్మకు న్యాయం చేసే దిశలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి గారు , స్టేట్ కన్వీనర్ గుత్తా భాస్కర్ నాయుడు గారు, స్టేట్ spoke పర్సన్ నాగ రంగయ్య గారు, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు పాల్గొన్నారు. నారాయణమ్మ సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.